యూపీలోని అలీఘర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ అమ్మాయికి పెళ్లి కుదిరిందని, ఆ సమయంలో అమ్మాయి తల్లి కాబోయే అల్లుడికి స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇచ్చిందన్నారు. అయితే వరుడు కాబోయే భార్యతో కాకుండా ఎక్కువగా అత్తతోనే ఫోన్ మాట్లాడేవాడని, ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ఏర్పడిందని పేర్కొన్నారు. చివరికి ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న బంగారం, రూ.5 లక్షల డబ్బు తీసుకొని లెటర్ రాసి పెట్టి పరారైనట్లు వధువు తండ్రి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa