పవన్ కళ్యాణ్ అర్ధాంగి అనా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆమె ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనా కొణిదల రేపు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడినందుకు ఆమె స్వామివారికి మొక్కులు చెల్లించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని రోజుల కిందట సింగపూర్ లోని ఓ కుకింగ్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం మార్క్ శంకర్ ను తీసుకుని పవన్, అనా కొణిదెల ఇండియా తిరిగొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa