ముంబయి 26 /11 దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించడంతో 16 ఏళ్ల తర్వాత ఈ కేసు మలుపు తిరిగింది. నవంబరు 26, 2008 నాటి ముంబయి ఉగ్రదాడుల కుట్రదారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణా.. ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్నాడు. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా.. తనకు కొన్ని వస్తువుల కావాలని అధికారులను కోరాడు. ముఖ్యంగా ఖురాన్ కాపీ, పెన్ను, పేపర్ వంటి ఇవ్వాలని అధికారులను అభ్యర్థించారు. అతడికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ.., ఖురాన్ ప్రతిని నమాజ్ కోసం ఉపయోగించాడని అధికారులు పేర్కొన్నారు. అవరసమైన వస్తువులను అతడికి అందిచప్పటికీ రాణా ప్రతీ చర్యను సునిశితంగా గమనిస్తున్నారు. అతడు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
కాగా, ముంబయి దాడుల ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పెద్ద సంఖ్యలో జరిగిన ఫోన్ కాల్స్ డేటా సహా దర్యాప్తు సంస్థ సేకరించిన వివిధ సాక్ష్యాల ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. తహవూర్ రాణాకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులతో అనుమానాస్పద సంబంధాలు, దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో అతడి అనుబంధంపై ప్రశ్నిస్తున్నారు.
నిధుల నిర్వహణ: ముంబయిలో పనిచేయని ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని నిర్వహించడానికి నిధులను ఎలా సమకూర్చాడనే దానిపై విచారిస్తోంది. 2006,-2009 మధ్య డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ నిఘా కార్యకలాపాలకు ఈ కార్యాలయం ఒక కేంద్రంగా పనిచేసింది. పాకిస్థాన్ హ్యాండ్లర్లతో అతడి సమావేశాలు, మెయిల్ సంభాషణల గురించి కూడా ఎన్ఐఏ అతడ్ని ప్రశ్నిస్తోంది.
ఉగ్ర కుట్ర: 2005లో డేవిడ్ హెడ్లీని భారత్‌లో గూఢచర్యం నిర్వహించమని లష్కరే తొయిబా ఆదేశించినప్పటి నుంచి జరిగిన కుట్రను ఈ విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు. ముంబయి ఉగ్రదాడులు ప్రణాళికల గురించి తెలిసిన దుబాయ్‌లోని రహస్య సాక్షి సహా అతడు కలిసిన ఇతర వ్యక్తుల గురించి కూడా రాణాను ప్రశ్నించనున్నారు. దేశ ఆర్థిక రాజధానిలో దాడులకు కొన్ని రోజుల ముందు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రాణా ప్రయాణాలు కీలక ఆధారాలు అందజేస్తాయని ఎన్ఐఏ అధికారులు ఆశిస్తున్నారు.
‘ తహవూర్ రాణా 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీలో ఉంటాడు. ఈ సమయంలో 26/11 ముంబయి ఉగ్ర దాడులు వెనుకున్న పూర్తి కుట్రను వెలికి తీయడానికి ఏజెన్సీ అతన్ని వివరంగా ప్రశ్నిస్తుంది. ఆ దాడుల్లో మొత్తం 166 మంది మరణించారు.. 238 మందికి పైగా గాయపడ్డారు’ అని శుక్రవారం తెల్లవారుజామున కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa