కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలికను నిందితుడు చాక్లెట్ ఆశ చూపించి మరీ అక్కడి నుంచి త్తుకెళ్లాడు. అయితే బాలిక చాలా సేపటి నుంచి కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. ఈక్రమంలోనే ఓ భవనంలోని బాత్రూంలో ఆమె చనిపోయి కనిపించగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అయితే అతడు లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ.. పోలీసులు వాటిని ఇంకా ధ్రువీకరించలేదు. వైద్య పరీక్షలు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
ఈక్రమంలోనే నిందితుడు బిహార్‌లోని పాట్నాకు చెందిన నితేష్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఆపై అతడు అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకెళ్లి గుర్తింపు ధ్రువీకరించేందుకు తీసుకెళ్తుండగా.. నిందితుడు పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. హెచ్చరికగా కాల్పులు జరిపినప్పటికీ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఓ పోలీస్ వాహనాన్ని సైతం ధ్వంసం చేశాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ అన్నపూర్ణ నిందితుడిని కాల్చారు. రెండు రౌండ్లు కాల్పులు జరిపి మరీ అతడిని ఎన్‌కౌంటర్ చేశారు... ఆపై అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనలో మరో పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు.
దీంతో నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసిన మహిళా పోలీస్ ఆఫీసర్ అన్నపూర్ణపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధితురాలికి సరైన న్యాయం చేశారంటూ చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర మహిళా శిశు సంక్షమేమా శాఖ మంత్రి హెబ్బాళ్కర్ స్పందించారు. పోలీస్ ఆఫీసర్ రితేష్ కుమార్‌ను కాపాడేందుకే అన్నపూర్ణ కాల్పులు జరిపారని మంత్రి నొక్కి చెప్పారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి.. హత్యాచార నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసిన మహిళా పోలీస్ ఆఫీసర్ అన్నపూర్ణకు ప్రతిష్టాత్మకరైన రాష్ట్ర అవార్డు అందజేయాలని కోరారు.
ముఖ్యంగా రాణి చన్నమ్మ అవార్డును అసాధార మహిళలకు ఇస్తారని.. కానీ ప్రభుత్వ అధికారులకు ఇవ్వకపోవడం వల్ల ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేయాలని తాను కోరడం లేదని చెప్పారు. కానీ ఏదో ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు అందించాలని.. రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి జి పరమేశ్వరతో స్వయంగా మాట్లాడతానని చెప్పారు.
బెళగావి జిల్లా ముదలగి తాలూకాలోని గుజనట్టి గ్రామానికి చెందిన రంగప్ప, కెంచవ్ ముక్కన్నవర్ దంపతుల తొమ్మిదవ సంతానమే అన్నపూర్ణ. గుజనట్టి ప్రాథమిక విద్య, ధర్మట్టిలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. గోకాక్‌లో ప్రీయూనివర్సిటీలో చదువుకుని ధార్వాడ్ నుంచి వ్యవసాయంలో బీఎస్సీ డిగ్రీని, బెంగళూరు నుంచి వ్యవసాయంలో ఎంఎస్సీని పూర్తి చేశారు. అయితే మొదటి ప్రయత్నంలోనే పీఎస్ఐ పరీక్షలో అన్నపూర్ణ ఉత్తీర్ణురాలయ్యారు. ఇలా తొలి పోస్టింగ్ హుబ్బళ్లి సిటీ పోలీస్ స్టేషన్‌లో కాగా.. ఆ త్రవా సీఈఎన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఇలా చాలా నెలలుగా హుబ్బళ్లిలోని ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లోనే పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa