పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు 75 వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa