యేసు క్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచిన పునరుత్థాన దినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని సి అండ్ ఐ జి మిషన్ చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
చర్చిని పూలతో అలంకరించి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు లేచెను. ఆదివరమున, జయ జయ యేసు జయ యేసు అంటూ ఈస్టర్ ప్రత్యేక గీతాలను ఆలపించారు. పాస్టర్ డాక్టర్ ఎం జి జయానందం, పాస్టర్ ఎంజీ ప్రేమావతి ఈస్టర్ ప్రత్యేకతను వివరించారు.
![]() |
![]() |