ఏడాదంతా చదివి.. ఎగ్జామ్స్ రాసే పిల్లలకు ఎంత టెన్షన్ ఉంటుందో.. దానికి వందింతలు పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు.ఇది సహజమే. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారనేదే మ్యాటర్. పిల్లలకు ఎగ్జామ్‌లో మార్కుల రాకపోతే పేరెంట్స్ తిడతారనే భయం, ఫెయిల్ అయితే కొడతారనే భయాన్ని చిన్నప్పటి నుంచి ఉంటుంది. అందుకే వారు పొరపాటునా మార్కులు తగ్గినా.. అనుకోకుండా ఫెయిల్ అయినా.. సబ్జెక్ట్ గురించి కాకుండా పేరెంట్స్ గురించి భయపడతారు. అందుకే ఈ సమయంలో పేరెంట్స్, పిల్లలు కొన్ని విషయాలపై అవగాహన ఉంచుకోవాలి.
డియర్ పేరెంట్స్..
పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినా.. ఏదైనా సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా.. లోపం ఎక్కడుందో తెలుసుకోండి. అంతేకానీ పిల్లలపై ఆ ప్రెజర్‌ని ఇవ్వడమో లేదా జడ్జ్ చేయడమో చేయకుంటే మంచిది. బాగా చదివే పిల్లలు కూడా టెన్షన్ వల్ల ఎగ్జామ్స్ బాగా రాయలేకపోవచ్చు. అలాగే ఆ సబ్జెక్ట్‌పై పిల్లలకు ఇంట్రెస్ట్ లేకపోయి కూడా ఉండొచ్చు. ఏ ఇతర కారణాలైనా ఉండొచ్చు. ఆ సమయంలో పిల్లలు ఫెయిల్ అవుతారు. లేదా మార్కులు తక్కువ తెచ్చుకుంటారు.
చనిపోవడానికి రీజన్ అదే..
చదువులో ఫెయిల్ అయినందుకు స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నారనుకుంటే పొరపాటే. ఫెయిల్ అయితే ఇంట్లో అమ్మానాన్న ఏమంటారో.. సొసైటీ ఎలా చూస్తుందో అనే భావనతోనే సగానికి పైగా స్టూడెంట్స్ చనిపోతున్నారు. పిల్లాడు లేదా పిల్ల చనిపోయిన తర్వాత మేము ఏమంటాము.. బతికుంటే ఇంకేదైనా పని చేసుకునేవాడివి అనే ఏడుస్తారు కానీ.. ఉన్నప్పుడు మేమున్నామనే భరోసా ఇచ్చేవారు చాలా తక్కువ. పిల్లలకి చదవమని చెప్పడం తప్పు కాదు. కానీ చదువు లేకుంటే ఇంక నువ్వు పనికిరావు అనే స్టేజ్‌కి ఏ పిల్లాడిని తీసుకురాకపోవడమే మంచిది.ఆ విషయాలు మాట్లాడండి..
ఒకవేళ మీ పిల్లలు చదువులో రాణించకపోయినా.. ఫెయిల్ అయినా వారితో పేరెంట్స్ కూర్చొని మాట్లాడాలి. వారికి స్టడీపై ఇంట్రెస్ట్ ఉందో లేదో.. లేదా వాళ్లు చదువుకోవడానికి సరైన వాతావరణం ఉందో లేదో తెలుసుకోవాలి. చదువు కాకుండా వారికి దేనిమీద ఇంట్రస్ట్ ఉందో తెలుసుకుని అటువైపుగా వారు రాణించేలా చూసుకోవాలి. నీ గోల్‌ని రీచ్ అవుతూ.. జస్ట్ పాస్ మార్కులు స్టడీలో తెచ్చుకోమని కూడా చెప్పొచ్చు. చెప్పే విధానం సరిగ్గా ఉంటే.. వినేవారిలో కచ్చితంగా మార్పు వస్తుందని తల్లిదండ్రులు గుర్తించుకోవాలి.
డియర్ స్టూడెంట్స్..
ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయితే చనిపోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోవారికి చెప్పండి. నేను మళ్లీ చదివి పాస్ అవుతానని వారికి నమ్మకాన్ని పెంచండి. మీ మీద పేరెంట్స్‌కి ఎక్స్పెక్టేషన్స్ ఉడండం తప్పు కాదు. కానీ వాటిని మీరు రీచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు ఎందుకు చదవలేకపోతున్నారో లేదా ఎందుకు చదువులో వెనకబడుతున్నారో అర్థమయ్యేలా చెప్పండి. సొసైటీ ఏమంటాదో అనే ప్రశ్న మైండ్‌లో ఉంచుకోవద్దు. మీరు ఎలా ఉన్నా వారు జడ్జ్ చేస్తారని గుర్తించుకోండి.
మార్కులు ఎక్కువ వచ్చి టాపర్‌గా ఉన్నవాళ్లే లైఫ్‌లో సక్సెస్ అవుతారనుకుంటే పొరపాటే. ఫెయిల్ అయినా తమకంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అలా అని మీరు ఫెయిల్ అయినా పర్లేదు అనట్లేదు. మీరు ట్రై చేయండి. మీ పేరెంట్స్ కోసం కాకున్నా మీకోసం చదివి.. కనీసం పాస్ అయితే.. మీకు నచ్చిన పనిని చేయడానికి ఇంట్లో వారి నుంచి అనుమతి లభిస్తుంది.ఫైనల్‌గా పేరెంట్స్, పిల్లల మధ్య అర్థం చేసుకునే హెల్తీ రిలేషన్ ఉంటే ఏ పిల్లాడు ఫెయిల్ అవ్వడు. ఒకవేళ అయినా చనిపోడు. జీవితంలో మంచిగా సక్సెస్ అవ్వాలంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే పిల్లలు కచ్చితంగా తమకు నచ్చిన ఫీల్డ్‌లో బాగా రాణిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa