జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయ బుధవారం నాడు నిరసనలతో అట్టుడికింది. ఈ దారుణ మారణకాండను ఖండిస్తూ లోయ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు. గత 35 ఏళ్లలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్‌లో ఇలాంటి సంపూర్ణ బంద్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఈ రక్తపాతాన్ని తీవ్రంగా ఖండించారు. పౌర సమాజ సభ్యులు, వ్యాపార సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, సాధారణ పౌరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బాధితులకు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి హింసాత్మక చర్యలను ఏమాత్రం సహించరాదని నిరసనకారులు అధికారులను డిమాండ్ చేశారు. శాంతి, న్యాయం, మత సామరస్యానికి కశ్మీరీలు కట్టుబడి ఉన్నారని ఈ నిరసన ప్రదర్శన చాటి చెప్పింది.మరోవైపు, కశ్మీర్‌లోని అన్ని పాఠశాలల్లోనూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం అసెంబ్లీల సమయంలో మరణించిన పర్యాటకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు, సంతాప సమావేశాలు నిర్వహించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa