కశ్మీర్ పవల్‌గామ్ ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ మీడియా సమావేశంలో ఈ దాడి ప్రభుత్వం కుట్ర అంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేశారు. ఇస్లాంను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకే ఆయనను అరెస్ట్ చేసినట్లు నాగాన్ జిల్లా పోలీసులు Xలో ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa