నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి భృతిని రూ.25 వేలకు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వారి భృతి రూ.20 వేలు ఉండగా.. రూ.5వేలు పెంచుతూ రూ.25 వేలు చేసింది. ఈ పెంపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు వర్తిస్తుందని, ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు సేవలందించే నాయీ బ్రాహ్మణుకలకే ఈ పెంపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుతో నాయీ బ్రాహ్మణులు తమ సమస్యలు చెప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa