ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 12:25 PM

కృష్ణాజిల్లా మోపిదేవి టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అవనిగడ్డకు చెందిన యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు బంతుల సుధాకర్ (18), బాలభాస్కర్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa