సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధల ప్రకటనను పదే పదే వాయిదా వేస్తూ రావటంతో చాలా మందిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. నిన్న మొన్నటి వరకు కాస్త స్థబ్తుగా ఉన్న జగన్ ఒక్క సారిగావేగం పెంచి, పార్టీలో చేరికలకు తెరలేపారు. మాగుంట శ్రీనివాసులు, బుట్టారేణుక, వంగా గీత ఇలా పలువరు నేతల సమీకరణలతో పార్టీ తరఫున అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను దాదాపుగా ఖరారు చేసినా మరోమారు మార్పులకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో . వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదివారం (మార్చి 17) ఉదయం 150 మంది అభ్యర్థులతో ఇడుపులపాయలో తొలి జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతుండటంతో ఎవరికి సీటు వస్తుందో అర్ధం కాని పరిస్థితి. అయితే ఈసారి గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్.. అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పార్టీ ఆంతరంగిక వర్గాలు చెపుతున్నాయి. ఆశావాహులు, అసంతృప్తులు, కొత్తగా పార్టీలో చేరిన వారు, సామాజిక సమీకరణలు ఇలా అన్నీ రకాలుగా సమీక్షించుకుని ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్ధితిలో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధలు ఎంపిక జరుగుతున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa