రానున్న 2020 అండర్-17 ఉమెన్స్ వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఫిఫా) అధ్యక్షడుడు గియానీ ఇన్‌ఫాంటినో ప్రకటించారు. 2017లో అండర్-17 మెన్స్ వరల్డ్‌కప్ తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న రెండో ఫిఫా టోర్నమెంటు ఇదే కావడం విశేషం. ఫిఫా అండర్-17 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకున్న విషయం విదితమే. ఈ విషయాన్ని అఖిలభారత ఫుట్ బాల్ సమాఖ్య కార్యదర్శి కుశాల్ దాస్ మీడియాకు వివరిస్తూ.. యువ మహిళా ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు భారత్‌కు ఇచ్చినందుకు ఫిఫాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.. భారత్‌లో మహిళల ఫుట్‌బాల్ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంటు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa