సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేసేందుకు జనసేన పార్టీ సై అంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఓవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ.. మిగతా స్థానాలపై కసరత్తు చేస్తూనే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోనూ అభ్యర్థులను పోటీకి పెట్టాలని నిర్ణయించారు. దీని కోసం తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీని కోసం శంకర్‌గౌడ్, అర్హంఖాన్‌తో జనసేనాని కమిటీ వేశారు. ఇక రేపటి నుంచి మూడు రోజుల పాటు విజయవాడ, హైదరాబాద్ మాదాపూర్‌లోని జనసేన కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
కాగా, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోమని స్పష్టం చేసిన పవన్.. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమై . బీఎస్పీతో కలిసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీచేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీచేస్తామని ప్రకటించారాయన
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa