ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి టిక్కెట్ ఇవ్వ‌లేద‌ని సునీల్ ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 03:50 AM

ఈ సారి ఎన్నిక‌ల‌లో త‌న‌కే టిక్కెట్టు ఇవ్వాలంటూ పూతలపట్టు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే సునీల్ కుమార్ బెదిరించిన‌ట్టే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు వైఎస్ జగన్ ఈసారి టికెట్ ఇవ్వడంలేదని కొద్దిరోజులుగా పూతలపట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న క్ర‌మంలో ఇటీవ‌ల ఆయ‌న నేరుగా  జగన్‌ను  క‌ల‌సి విష‌యం తేల్చుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లోని లోటస్ పాండ్‌కు వెళ్లిన ఆయ‌న‌కి  జగన్ క‌నీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో మనస్థాపం చెందిన సునీల్... తనకు పూతలపట్టు టికెట్ ఇవ్వకపోతే చనిపోతానంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు జగన్‌కు, మీడియాకు  పంపారు. అయితే వైసిపి వ‌ర్గాల నుంచి కానీ జ‌గ‌న్ నుంచి కానీ త‌గిన స్పంద‌న లేక పోవ‌టంతో   నిద్రమాత్రలు మింగి చేతిపై కత్తితో కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.  ఇది గ‌మ‌నించిన ఆత‌ని కుటుంబ స‌భ్యులు  హుఠాహుఠిన  పలమనేరు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. చికిత్స కొనసాగుతోందని, ప్రమాదం తప్పిందని, . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa