ఇప్పటికే 126 మందితో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన అధికార తెలుగుదేశం పార్టీ శనివారం మరింత స్పీడు పెంచేసింది. ఇప్పటికే జాతీయాధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక వేగవంత చేస్తూ, అసంతృప్తులకు హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా ఎన్నికల ప్రచారం ఆరంభించే తిరుపతి నుంచి చంద్రబాబు వెంకన్నని దర్శించుకుని ప్రచార రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రచారాన్ని కూడా ఆరంభించేసారు. తాజాగా శనివారం అర్ధరాత్రి 15 మంది అభ్యర్ధులతో రెండో జాబితాను ప్రకటించింది టిడిపి కార్యాలయం. వివరాలు ఇలా ఉన్నాయి.
1. పాలకొండ- నిమ్మక జయకృష్ణ
2. పిఠాపురం- ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ
3. రంపచోడవరం- వంతల రాజేశ్వరి
4. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
5. పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్
6. పామర్రు- ఉప్పులేటి కల్పన
7. సూళ్లూరుపేట- పరసావెంకటరత్నం
8. నందికొట్కూరు- బండి జయరాజు
9. బనగానపల్లె- బిసి జనార్దన్‌రెడ్డి
10. రాయదుర్గ్- కాల్వ శ్రీనివాసులు
11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్
12. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి
13. మడకశిర- కె.ఈరన్న
14. మదనపల్లి- దమ్మాలపాటి రమేష్
15. చిత్తూరు- ఏఎస్ మనోహర్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa