ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ వికారినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 03:07 AM

  టిటిడి రూపొందించిన శ్రీ వికారినామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజుతో కలిసి ఆవిష్కరించారు. తిరుమలలో శ‌నివారం సాయంత్రం శ్రీ‌వారి తెప్పోత్సవాల సందర్భంగా ఈ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
అనంత‌రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ తెప్పోత్స‌వాలలో మొద‌టి రోజు  శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా  శ్రీరామచంద్రమూర్తి తెప్పపై భక్తులకు దర్శనమిచ్చార‌న్నారు. రెండవ రోజు మార్చి 17న రుక్మిణీ సమేతంగా శ్రీక ష్ణస్వామి అవతారంలో మూడుమార్లు విహరిస్తార‌ని, మూడవ రోజు మార్చి 18న  శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తార‌న్నారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 19న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 20వ తేదీ ఏడుమార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షించ‌నున్న‌ట్లు తెలిపారు.
టిటిడి ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పంచాంగాన్నిటిటిడి ఆస్థాన సిద్ధాంతి  శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి రచించినట్లు తెలియ‌జేశారు.

         

        ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa