ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్‌ జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 10:28 AM

కడప: వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి ఇడుపుల‌పాయ చేరుకున్నారు. అక్కడ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడ‌తారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత డెంకాడ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa