రాష్ట్రంలో లబ్ధిదారులే మన ప్రచార సారథులు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలక్షన్ మిషన్-2019పై పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. పెద్దకుమారుడిగా నా తరపున 70 లక్షల మంది రైతులే ప్రచారం నిర్వహిస్తారన్నారు. పెద్దన్నగా నా తరపున కోటి మంది చెల్లెళ్లే ప్రచారం చేస్తారన్నారు. పది రెట్లు పింఛన్ పొందేవాళ్లంతా టీడీపీ ప్రచార సారథులేనన్నారు. టీడీపీ తరపున యువతరం కదం తొక్కాలన్నారు. ప్రజల్లో పరపతి లేనివాళ్లే టీడీపీ నుంచి బయటకు పోతున్నారన్నారు. స్వలాభం కోసం పార్టీలోకి వచ్చినవాళ్లే బయటకు పోతున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసమే కొందరికి టిక్కెట్లు ఇవ్వలేక పోయామన్నారు. టీడీపీ నుంచి 2019-24 సమర్థ బృందాన్ని ఎంపిక చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa