ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే జనసేనలో సి.బి.ఐ. మాజీ జేడీ శ్రీ లక్ష్మీనారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 11:08 AM

అమరావతి : నేడే జనసేనలో సి.బి.ఐ. మాజీ జేడీ శ్రీ లక్ష్మీనారాయణ చేరిక. సి.బి.ఐ. మాజీ జాయింట్ డైరెక్టర్  వి.లక్ష్మీనాహ్రాయణ ఆదివారం ఉదయం 10గం.30ని. జనసేన పార్టీలో చేరనున్నారు. శనివారం రాత్రి ఒంటి గంటకు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన  లక్ష్మీనారాయణకు జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు. తరువాత సుదీర్ఘంగా ఇరువురూ చర్చించారు. సుమారు గంట 45 నిమిషాలపాటు వీరిరువురూ మాట్లాడుకున్నారు.లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై  ఆయన చేరిక తరువాత ప్రకటిస్తారు.లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, విద్యావేత్త  కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి  రాజగోపాల్ జనసేనలో చేరనున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa