విజయవాడ: ఒక మార్పు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనసైనికుల్లో తానూ ఒక సైనికుడిగా మారానన్నారు. సేనాధిపతి మార్గదర్శకంలో ముందుకెళ్దామన్నారు. జనసేనలో పని చేసే అవకాశమిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa