అమరావతి : ఈ ఎన్నికలు ధర్మ యుద్ధమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ధర్మ యుద్ధంలో మనదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్ -2019 పై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు. ఇప్పటి వరకూ రెండు విడతలుగా 151 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఎన్నికలకు ఇక 24 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందన్న ఆయన నిద్రాహారాలు మాని ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa