తమిళనాడుకు చెందిన ఏఎంఎంకే పార్టీ ఆదివారం 24మందితో కూడిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్ స్వయంగా అభ్యర్థులను ప్రకటించారు. అనర్హత వేటుకు గురైన తొమ్మిది మంది నేతలకు కూడా జాబితాలో చోటు దక్కడం గమనార్హం. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో 38 సీట్లలో ఏఎంఎంకే పోటీ చేయనుందని పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ఇప్పటికే ప్రకటించారు. మరో స్థానాన్ని మిత్రపక్షం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కేటాయించనున్నట్లు తెలిపారు.
జాబితాలో తిరుచిరపల్లి మాజీ మేయర్ సరుబల తొండైమాన్, మాజీ స్పీకర్ కలిముత్తు కుమారుడు డేవిడ్ అన్నాదురై ఉన్నారు. మధురై నుంచి డేవిడ్ పోటీ చేయనుండగా.. సరుబల తిరుచిరపల్లి నుంచి బరిలోకి దిగనున్నారు. కాగా తమిళనాడులో ఏప్రిల్ 8న ఎంపీ స్థానాలతోపాటు 21 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa