ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవి తింటే చాలు, షుగర్ తో పాటు బీపీ కూడా కంట్రో

Health beauty |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 11:55 PM

బీపీ,షుగర్ వచ్చిన తరవాత వాటిని వీలైనంత వరకూ కట్టడి చేయగలిగే ఒకే ఒక మార్గం చాలా కచ్చితంగా డైట్ పాటించడం. ఆహారపు అలవాట్లు మార్చుకోక తప్పదు. అన్నింటికీ మందులు వాడడం కాకుండా కొన్ని ఇంటి చిట్కాలు, సహజమైన పద్ధతుల్లో వీటిని కంట్రోల్ లో పెట్టుకోవాలి. పరిగడుపున కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది.


బీపీ, షుగర్, ఈ రెండు జబ్బులు ఎంతో మందిని వేధిస్తున్నాయి. రెండూ దీర్ఘకాలిక వ్యాధులే. ఒక్కసారి వచ్చాయంటే అంత సులువుగా వదిలి పెట్టవు. వీటితో పాటు మరెన్నో సమస్యలు వస్తాయి. మొత్తంగా ఆరోగ్యంగా జీవించే అవకాశం లేకుండా చేస్తాయి. వచ్చిన తరవాత ఇలా ఇబ్బందులు పడడం కన్నా ఇవి రాకుండా ముందస్తుగా జాగ్రత్తపడడం మంచిది. వాతావరణ మార్పులు కావచ్చు, లేదా మన ఆహారపు అలవాట్లు కావచ్చు. కారణమేదైనా చాలా తక్కువ వయసులోనే డయాబెటిస్, బీపీ అటాక్ చేస్తున్నాయి. ఈ రెండింటినీ కంట్రోల్ లో ఉంచుకుంటే తప్ప ఆరోగ్యంగా జీవించే పరిస్థితి లేదు.


అన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉంటున్న ఈ రోజుల్లో జబ్బులు వచ్చేందుకు చాలా అవకాశాలుంటున్నాయి. అయితే బీపీ,షుగర్ వచ్చిన తరవాత వాటిని వీలైనంత వరకూ కట్టడి చేయగలిగే ఒకే ఒక మార్గం చాలా కచ్చితంగా డైట్ పాటించడం. ఆహారపు అలవాట్లు మార్చుకోక తప్పదు. అన్నింటికీ మందులు వాడడం కాకుండా కొన్ని ఇంటి చిట్కాలు, సహజమైన పద్ధతుల్లో వీటిని కంట్రోల్ లో పెట్టుకోవాలి. పరిగడుపున కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది.


ఉసిరి కాయలు


పరిగడుపునే ఉసిరి కాయలు తింటే ఎంతో ఆరోగ్యకరం. ఇందులో ఎన్నో పోషకాలుంటాయి. కేవలం షుగర్ నే కాదు. బీపీని కూడా కంట్రోల్ చేయగలిగే గుణాలు ఉసిరిలో ఉన్నాయి. విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పరిగడుపునే ఉసిరి కాయ తినడం వల్ల పొట్టలో ఉన్న మలినాలు తొలగిపోవడంతో పాటు మెటబాలిజం మెరుగవుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరగడం కంట్రోల్ అవుతుంది. మొత్తంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


దాల్చిన చెక్క


దాల్చిన చెక్కలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే గుణాలున్నాయి. ఇది తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అయితే..దాల్చిన చెక్కతో పాటు మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే మరిన్ని పోషకాలు అందుతాయి. ఇందులో ఉండే పైప్ రైన్ పోషకాలు శరీరానికి సమపాళ్లలో అందేలా చూస్తుంది. దాల్చిన చెక్క, నల్ల మిరియాలను పొడి చేసుకుని ఉదయమే గ్లాసెడు నీళ్లలో కలుపుకుని తాగితే బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. శరీరంలో రక్త సరఫరా సరైన విధంగా అవడంతో పాటు ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలో ఈ రెండూ బాగా పని చేస్తాయి.


మెంతులు


డయాబిటెస్ కంట్రోల్ చేయడంలో మెంతులు మంచి మెడిసిన్. చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉదయమే మెంతులు తీసుకుంటారు. వాటిని నానబెట్టి ఆ నీళ్లు కూడా తాగుతారు. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్ గా ఉండేలా చూస్తుంది. ఉదయమే పరిగడుపున ఓ టేబుల్ స్పూన్ మేర మెంతులు తింటే మంచిది. అయితే రాత్రిపూటే నీళ్లలో వీటిని నానబెట్టుకోవాలి. ఉదయమే వాటిని తిని ఆ నీళ్లు తాగాలి. బీపీని తగ్గించడంతో పాటు యాంగ్జిటీని కూడా పోగొడుతుంది.


పసుపు నీళ్లు


పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడంలో మెంతుల తరవాతి స్థానం పసుపుదే. ఇందులో ఉండే కర్ క్యుమిన్ షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. అయితే ఇందులో నిమ్మరసం కలుపుకుని తాగితే రెట్టింపు ప్రయోజనాలుంటాయి. జీర్ణ ప్రక్రియ మెరుగవడంతో పాటు లివర్ డిటాక్సిఫై అవుతుంది. పరిగడుపునే ఈ జ్యూస్ తాగితే ఇన్ ఫ్లమేషన్ తగ్గిపోతుంది. వీటితో పాటు అవిసె గింజలు కూడా బీపీ, షుగర్ ని బాగా కంట్రోల్ చేస్తాయి. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. చియా గింజల్ని నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లు పరిగడుపునే తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. హైపర్ టెన్షన్ సమస్య కూడా తగ్గిపోతుంది.


టమోటా, దానిమ్మ


టమోటాతో పాటు దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. టమోటాల్లోని లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ ని తగ్గించి బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. దానిమ్మ రసం రక్తసరఫరాని పెంచి ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఉదయమే పరిగడుపున దానిమ్మ పండ్ల రసం, టమోటా జ్యూస్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. గుండె సంబంధిత జబ్బులు వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే బీపీ, షుగర్ వ్యాధుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa