ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నీ సబ్జెక్టుల్లో ఫెయిల్.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన తల్లిదండ్రులు

national |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 09:24 PM

నేటి కాలంలో చదువు కూడా ప్రెస్టేజ్ అంశంగా మారింది. పిల్లలు సరిగా చదవకపోతే తల్లిదండ్రులు చాలా అవమానంగా ఫీలవుతున్నారు. ఫెయిల్ సంగతి పక్కకు పెడితే.. మార్కుల విషయంలో ఇతర పిల్లలతో పోల్చి.. తమ బిడ్డలను అవమానిస్తూ.. వారిని మానసిక వేదనకు గురి చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రవర్తన.. పిల్లల మనసుపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే ఫెయిలైనా, మంచి మార్కులు రాకపోయినా.. కన్నవాళ్లు ఏమాంటారో అనే భయంతో చాలా మంది పిల్లలు చాలా చిన్న వయసులోనే ఆత్మహత్యకు పాల్పడుతూ జీవితాన్ని ముగిస్తున్నారు.


అలాంటి తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలవబోతున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతులు. కుమారుడు పదో తరగతిలో అన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ కుర్రాడిని ఒక్క మాట కూడా అనలేదు. పర్లేదు మరోసారి ప్రయత్నం చేసి.. అన్ని పరీక్షల్లో పాస్ అవుదాం అని వెన్నుతట్టి ప్రోత్సాహించారు. జీవితం అంటే పరీక్షలు ఒక్కటే కాదు అనే భరోసా ఇచ్చారు.ఈ తల్లిదండ్రులు చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..


ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తాజాగా కర్ణాటక టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ క్రమంలో బాగల్కోటె జిల్లా నవనగరకు చెందిన అభిషేక్‌ పదో తరగతి పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. అన్ని సబ్జెక్టులూ కలిపి 625కు 200 మార్కులు వచ్చాయి. ఈ విషయం తెలసుకున్న అభిషేక్ సహా విద్యార్థులు కొందరు అతడిని హేళన చేశారు.. అవమానించారు. అయితే కుమారుడి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు.. ఏమాత్రం ఆలోచించకుండా ఓ కేక్‌ తెప్పించి.. దానిపై అతడు సాధించిన మార్కుల పర్సంటేజ్ 32 అని రాయించారు. ఆ తర్వత కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్‌ చేయించి వేడుక చేశారు.


పదో తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చని, ఫెయిలైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గట్టిగా ధైర్యం చెప్పారు. కష్ట సమయాల్లో కుమారుడికి అండగా నిలిచారు. ఆ తల్లిదండ్రులు స్పందించిన తీరుపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపై తాను శ్రద్ధగా చదివి పరీక్షలో పాస్ అవుతానని తెలిపాడు అభిషేక్.


ఇక తాజాగా తెలంగాణ పది ఫలితాల వెల్లడి తర్వాత ఓ విద్యార్థి పేరు వార్తల్లో నిలిచింది.


తండ్రి మరణం, పూటగడవని పరిస్థితితో కూలీ పనులకు వెళ్లేందుకు సిద్ధమైన స్టూడెంట్ భరత్‌ను జిల్లా కలెక్టర్ వెన్నుతట్టి ప్రొత్సహించగా.. పది ఫలితాల్లో సత్తా చాటాడు. 73 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో పాసయిన సంగతి తెలిసిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa