ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రి వేళ మహిళతో కార్యాలయంలోకి..! ఏం జరుగుతోంది

Crime |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 11:05 PM

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డివిజనల్ కార్యాలయంలో ఒక ఉద్యోగి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి క్రమం తప్పకుండా రాత్రిపూట ఒక మహిళతో కలిసి కార్యాలయానికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పర్యాటక శాఖకు చెందిన ఉద్యోగి కావడంతో.. సెక్యూరిటీ సిబ్బంది కూడా వారిని ప్రశ్నించడానికి సాహసించలేదని సమాచారం.


‘‘ఆ ఉద్యోగి తన ద్విచక్ర వాహనంపై ఆ మహిళను వెంటబెట్టుకుని వచ్చి కార్యాలయం ఆవరణలో పార్క్ చేసేవారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లేవారు. దాదాపు అరగంట తర్వాత వారు తిరిగి బయటకు వెళ్లిపోయేవారని.. ఇలా నిత్యం రాత్రి సమయంలో ఒక మహిళతో ఉద్యోగి కార్యాలయానికి వస్తుండటంతో.. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని ఏపీటీడీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అధికారులు కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఫుటేజ్‌లో రికార్డయిన దృశ్యాలు చూసిన తర్వాత అధికారులు షాక్‌కు గురయ్యారని సమాచారం’’. ఆ ఉద్యోగి కార్యాలయంలో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు వారికి తెలిసినట్లు ప్రచారం జరుగుతోంది.


దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. డివిజనల్ కార్యాలయంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా తీవ్రమైన విషయమని భావించిన వారు తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఆ ఉద్యోగి తన వాట్సాప్ స్టేటస్‌లో సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోను పెట్టుకోవడంతో, విషయం మరింత స్పష్టంగా బయటపడగా.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందట.


సదరు ఉద్యోగి గతంలో హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్ రూమ్‌ను కూడా తన వ్యక్తిగత కార్యకలాపాల కోసం ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడకు వాకింగ్‌కు వచ్చే మహిళలను తరచూ స్టాఫ్ రూమ్‌లోకి తీసుకువెళ్లి అనుచితంగా ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇతర సిబ్బందిని బయటకు పంపి.. తన కార్యకలాపాలు కొనసాగించేవాడని సమాచారం.


దీంతో విసిగిపోయిన కొందరు సిబ్బంది రహస్యంగా ఒక పథకం వేసి అతని చర్యలను బయటపెట్టారు. కార్యాలయంలోని ఏసీ పైపుల రంధ్రానికి ఒక సీక్రెట్ కెమెరాను అమర్చి.. అతని కార్యకలాపాలను రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో ఫుటేజ్‌ను ఉన్నతాధికారులకు చూపించడంతో విషయం వెలుగులోకి రాగా.. వారు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa