IPL-2025లో భాగంగా వాంఖడే వేదికగా మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించారు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్షద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వచ్చారు.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(W), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(C), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(C), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa