ఉల్లిపాయలు ప్రతి ఇంటి వంటగదిలో ఉండాల్సిందే. వంటల్లో ఎక్కువగా ఉల్లిపాయను వాడతారు. చాలా మంది ఉల్లిపాయ లేకుండా వంటలు వండలేరు. ఉల్లిపాయ డిమాండ్ అలాంటిది మరి. ఉల్లిపాయతో చేసే వంటలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సామెత ఉంది. అంటే ఉల్లిపాయలతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉల్లిపాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
అంతేకాకుండా ఉల్లిపాయను జట్టు సంరక్షణ కోసం వాడతారు. అంతేకాకుండా అందం మెరుపులకు కూడా ఉల్లిపాయ మంచి ఔషధం. ఇలా ఉల్లిపాయలతో ఎన్నో ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొందరు మాత్రం ఉల్లిపాయ తినకూడదు. తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. పచ్చి ఉల్లిపాయలు ఎవరు, ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు
ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఉల్లిపాయల్ని ఎక్కువగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి అనేక అంశాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇప్పటికే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు తింటే మీ పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. మలబద్ధకంతో బాధపడేవారు కూడా ఉల్లిపాయ ఎక్కువగా తినకూడదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
డయాబెటిస్
డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా ఉల్లిపాయ తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉల్లిపాయలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఉల్లిపాయలను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది మీ ఆరోగ్యానికి హానికరంయ. కాబట్టి షుగర్ రోగులు ఉల్లిపాయలను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఒకవేళ మీరు ఉల్లిపాయ ఎక్కువగా తినాలనుకుంటే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ముఖ్యం.
గర్బిణీ స్త్రీలు
గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం, ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఉల్లిపాయలను అధికంగా తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు హానికరం కావచ్చు. అది గుండెల్లో మంటను కలిగిస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో ఉల్లిపాయల్ని ఎక్కువగా తినకూడదని పెద్దలు అంటుంటారు. పాలిచ్చే తల్లులు కూడా ఉల్లిపాయలు తినే విషయంలో అలర్ట్‌గా ఉండండి. ఎక్కువగా తింటే బిడ్డ జీర్ణక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లల్లో కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్
జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు ఉల్లిపాయను తినకపోవడమే మేలు. ఉల్లిపాయలలో FODMAPలు (కిణ్వ ప్రక్రియకు గురయ్యే ఒలిగోశాకరైడ్లు, డైశాకరైడ్లు, మోనోశాకరైడ్లు, పాలియోల్స్) ఉండటం వల్ల కొన్నిసార్లు IBS లక్షణాలకు ట్రిగ్గర్ కావచ్చు. ఈ కారణం వల్ల జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయ బెస్ట్ ఆప్షన్ కాదు. ఉల్లిపాయ తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.
రక్తస్రావం లోపాలు
కొన్ని అధ్యయనాల ప్రకారం ఉల్లిపాయలు రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదించేలా చేస్తాయి. ఇప్పటికే రక్తస్రావం లోపాలతో బాధపడేవారు ఉల్లిపాయల్ని తినకూడదు. అంతేకాకుండా రక్త గడ్డకట్టడంలో ఇబ్బందులు పడేవారు మందులు తీసుకుంటుంటారు. ఇలాంటి వారు కూడా ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మెడిసిన్‌తో రియాక్షన్ జరిపే అవకాశం ఉంది.
వీళ్లు కూడా జాగ్రత్త
* దుర్వాసన సమస్యతో బాధపడేవారు కూడా ఉల్లిపాయకు దూరంగా ఉండాలి. ఉల్లిపాయ తినడం వల్ల మీ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాసనను పెంచుతాయి.
* కొంతమందికి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, మంట, వాపు వచ్చే అవకాశం ఉంది. ఇలా అలెర్జీ సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి.
* అపానవాయువు సమస్యతో బాధపడేవారు కూడా ఉల్లిపాయల్ని మితంగా తినాలి. లేదంటే మీ సమస్య తీవ్రం కావచ్చని నిపుణులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa