నేటి బిజీ జీవితంలో, ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వారికే సమయమే దొరకడం లేదు. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. వర్క్ లైఫ్‌స్టైల్ కారణంగా నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి చాలా మంది వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి తమ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు.
అయితే చాలా మంది ఎంచుకుంటున్న ఆప్షన్ వాకింగ్. అయితే, చాలా మంది ఉదయం పూట మాత్రమే వాకింగ్ చేస్తుంటారు. ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అవును, మార్నింగ్ వాక్ వల్ల ఎన్నో లాభాలు చేకూరతాయి. అయితే, చాలా తక్కువ మందికి మాత్రమే సూర్యాస్తమయం తర్వాత వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసు. డాక్టర్ SA రెహమాన్ (జనరల్ మెడిసిన్, నిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నోయిడా) సూర్యాస్తమయం తర్వాత నడిస్తే శరీరంలో జరిగే మార్పులు, ప్రయోజనాల గురించి వివరించారు. వాటి గురించి ఇప్పుడు చుద్దాం.
సూర్యాస్తమయ నడక అంటే ఏంటి? (సన్‌సెట్ వాకింగ్)
సూర్యుడు అస్తమించే సమయాన్ని సూర్యాస్తమయం అంటారు. సూర్యాస్తమయ సమయంలో చేసే నడకను సూర్యాస్తమయ నడక అంటారు. ఈ వాకింగ్ వల్ల ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని డాక్టర్ చెబుతున్నారు. ప్రకృతితో అనుసంధానం కావడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం అని డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ వాకింగ్ మానసిక స్థితిని మెరుగుపరుస్తూనే, శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
ఈ రోజుల్లో పని ఒత్తిడి కారణంగా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే, రోజులోని హడావిడి తర్వాత ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యాస్తమయ సమయంలో ఆకాశ దృశ్యం, చల్లని గాలి, మృదువైన కాంతి కలిసి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది మానసిక అలసటను తగ్గిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత నడవడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది.
జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది
రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సాయంత్రం భోజనం తర్వాత నడవడం తరచుగా మంచిది. కానీ మీరు రాత్రి భోజనానికి ముందు సూర్యాస్తమయం తర్వాత నడిస్తే జీర్ణక్రియ ప్రయోజనాల్ని పొందవచ్చు. జీర్ణసమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆప్షన్ అని డాక్టర్ చెబుతున్నారు.
శరీరం చురుగ్గా ఉంటుంది
ఈ రోజుల్లో ప్రజలు గంటల తరబడి ఆఫీసుల్లో కూర్చొని పని చేస్తున్నారు. దీని వల్ల వారి శరీరం సోమరిగా మారుతుంది. బరువు కూడా పెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం నడక వారికి చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది.
చర్మానికి మేలు
ఉదయం సమయం విటమిన్ డి పొందడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. కానీ సూర్యాస్తమయం సమయంలో తేలికపాటి సూర్యకాంతి కూడా చర్మానికి మేలు చేస్తుందని డాక్టర్ అంటున్నారు. చర్మం నిగారింపులో ఈ సూర్యకాంతి బాగా పనిచేస్తుందని తెలిపారు. ఇది ఎముకలను బలపరుస్తుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
ఇంకా బోలెడు లాభాలు
* ప్రకృతిలో నడవడం వల్ల ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది. ప్రశాంత వాతావరణంలో నడిచినప్పుడు, కొత్త ఆలోచనలు మనసులోకి వస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది.
* సాయంత్రం కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి వాకింగ్‌కి వెళ్లడం వల్ల సామాజిక బంధాలు బలపడతాయి. ఇది మీరు వారికి సమయం ఇవ్వాల్సిన సమయం. కలిసి నడవడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది.
* సూర్యాస్తమయం సమయంలో ఆకాశంలో పక్షుల కిలకిలరావాలు, చల్లటి గాలి మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది ఒక రకమైన ధ్యానం. సూర్యస్తమయం తర్వాత నడవడం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa