భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో అత్యాధునిక ఆయుధాలను వినియోగించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో స్కాల్స్ క్షిపణులు, హ్యామర్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ ఆపరేషన్ మే 7, 2025 అర్థరాత్రి 1:05 నిమిషాలకు ప్రారంభమై, 1:30 నిమిషాలకు ముగిసినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో డ్రోన్లు, ఇతర ఖచ్చితమైన ఆయుధాలను వినియోగించి శత్రు శిబిరాలను పూర్తిగా నాశనం చేసినట్లు సమాచారం. ఈ దాడుల ఫలితంగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, శిక్షణ కేంద్రాలు ధ్వంసమైనట్టు భారత భద్రతా వర్గాలు తెలిపాయి.
‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా భారత సైన్యం తన సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ఆపరేషన్‌ను భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఖురేషీ నేతృత్వంలో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడులు భారత సరిహద్దుల నుంచే జరిగినట్లు, ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలతో పాటు టెర్రర్ ఇండక్షన్ సెంటర్లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వివరాలు అందుతున్నాయి.
ఈ ఆపరేషన్‌కు ‘సింధూర్’ అనే పేరు ఎంచుకోవడం వెనుక పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఉగ్రవాదులు భారతీయ మహిళల సింధూరాన్ని అవమానించిన నేపథ్యంలో, ఈ ఆపరేషన్ ద్వారా న్యాయం అందించినట్లు సైన్యం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa