పహల్‌గామ్ బాధితులకు న్యాయం అందించేందుకు భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వివరాలను వెల్లడించేందుకు విదేశాంగ, రక్షణ శాఖలు బుధవారం ఢిల్లీలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి.
ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, "పహల్‌గామ్‌లో మృతిచెందిన వారికి న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాం. గత 30 ఏళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాద మూకలకు సహకారం అందిస్తోంది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేశాం. మొత్తం 21 ఉగ్ర స్థావరాలను పాకిస్థాన్, పీవోకేలో గుర్తించాం" అని తెలిపారు.
ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదానికి సంబంధించిన పాకిస్థాన్ ఆధారిత నెట్‌వర్క్‌ను ఛిన్నాభిన్నం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కల్నల్ సోఫియా స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa