ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు అమిత్ షా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం

national |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 05:01 PM

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష చేపట్టారు. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్ లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమీక్ష సమావేశానికి జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం సీఎంలు హాజరయ్యారు. లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ సమీక్షలో  పాల్గొన్నారు.  ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మే 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశంలో పంచుకోనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa