రైల్వే కోడూరు పట్టణంలోని పాతబజార్ ప్రాంతంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంకు శుభారంభంగా గురువారం భూమి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa