ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని చలనచిత్ర దర్శకుడు రామ్ గోదల శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. ఆయన దర్శకత్వంలో రూపొందించిన 'ఓ బామ అయ్యో రామ' చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకి తీర్థప్రసాదాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa