అనంతపురం జిల్లా రొద్దం మండలం కందుకూరిపల్లి గ్రామంలో శనివారం జరిగిన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు మరియు పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఉషశ్రీ చరణ్‌కు స్వామి చిత్రపటాన్ని అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకున్న ఆమె, గ్రామ అభివృద్ధి పట్ల తన కట్టుబాటును వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa