ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానం లేదు.. తెదేపాదే విజయం : చంద్రబాబు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 12:34 AM

కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల్లో గెలుపుపై తనకు ఏమాత్రం అనుమానం లేదని.. కచ్చితంగా తెదేపానే ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సోమ‌వారం ఒంగోలులో నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. ప్రజలంతా తెదేపాకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. తెదేపాను మరింత శక్తివంతమైన పార్టీగా తయారు చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. తనకు సమర్ధవంతమైన సైన్యం ఉందని అలెగ్జాండర్‌ చెప్పేవారని.. తెదేపాకు కూడా 65లక్షల పసుపు సైన్యం ఉందన్నారు. డ్వాక్రా సంఘాల్లో కోటి మంది చెల్లెమ్మలు తనకు ఉన్నారని.. ఏ నాయకుడికీ ఇంతమంది చెల్లెమ్మలు ఉండరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa