ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకాశం జిల్లా ఆయకట్టు కాపాడే బాధ్యత మాది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 12:38 AM

అన్నదాతా సుఖీభవ కింద రైతులకు ఆర్థికసాయం చేస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. ఒంగోలులో పార్టీ కేడ‌ర్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఆయకట్టు కాపాడే బాధ్యత తీసుకుంటాం. గుండ్లకమ్మ, కొరిశపాడు, సాగర్‌ కుడికాల్వ పనులు పూర్తి చేశాం’’ అని చంద్రబాబు వివరించారు. ‘‘వెనుకబడిన వర్గాలు తెదేపాకు కంచుకోట. ఆదరణ-1, ఆదరణ-2 పథకాలతో ఆయా వర్గాల ప్రజలను ఆదుకున్నాం. అన్న క్యాంటీన్లలో రూ.5లకే రుచికరమైన భోజనం అందిస్తున్నాం. సుపరిపాలనకు నాంది పలికాం. డ్వాక్రా సంఘాల్లోని కోటి మంది మహిళలకు రూ.లక్ష కోట్ల వరకు సహాయం చేశాం. ఒక్కొక్కరికీ పసుపు-కుంకుమ కింద రూ.20వేలు అందజేశాం. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద రూ.5లక్షలు ఇస్తున్నాం. పింఛను రూ.2వేలు చేసి వృద్ధులందరికీ పెద్దకొడుకుగా ఉన్నాన‌ని కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వాల‌న్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa