టీ ఆర్ ఎస్ కు పార్ట్ టైమ్, వైకాపాకు ఫుల్ టైమ్ వర్కింగ్ ప్రసిడెంట్ గా కే టీ ఆర్ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి రేయింబవళ్లు జగన్ కోసం పనిచేస్తున్న కేటిఆర్‌కు ఎపి రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఏపీలో పోటీ చేయటానికి ఎందుకు ముందుకు రావటంలేదని నిలదీసారు. కేటీ ఆర్ ఒంటరిగాగానీ, మీ రహస్య మిత్రుడు జగన్ తో కలిసి గానీ పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోగలరా? త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్, కే టీ ఆర్ లు గుండెలు బాదుకోవటం ఖాయమన్నారు.
చంద్రబాబునాయుడు వద్ద కే సీ ఆర్ పనిచేశారనటంలో తప్పేముంది? టీ డీ పీ పెట్టిన బిక్షతోనే కేసీ ఆర్ రాజకీయంగా ఎదిగారన్న విషయం కే టీ ఆర్ తెలుసుకోవాలని లేకుంటే నోరుమూసుకుని కూర్చోవాలన్నారు.. గజదొంగ జగన్ కోసం కేటీ ఆర్ దొంగ అవతారమెత్తాడని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటాను పోలీసుల సాయంతో చోరీ చేసి జగన్ కు అప్పగించటంలో కే టీ ఆర్ కీలకపాత్ర పోషించారనటంలో తమకు ఎలాంటి సందేహంలేదని అన్నారు.. మాయ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీకు కుటుంబ సభ్యులను వదలిపెట్టి 5 కోట్ల ఆంధ్రప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం శ్రమిస్తున్న చంద్రబాబునాయుడు గారిని విమర్శించే అర్హత లేదన్నారు మంతెన సత్యనారాయణరాజు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa