న్యూఢిల్లీ : తూర్పు ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం నాడు గంగా నది తీరాన ఎన్నికలప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ నాయనమ్మ అయిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బాటలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడం విశేషం. గతం లో తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ తరఫున మాత్రమే ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ప్రియాంక గాంధీ నేడు ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్పార్టీ కి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. ప్రయాగరాజ్ నుంచి వారణాసి వరకు గంగా నదిలో స్టీమ్ బోట్ లో ప్రయాణాన్ని ప్రియాంక గాంధీ ఎంచుకున్నారు.ఉత్తర ప్రదేశ్ కు జీవనాడి అయినగంగా మాత సాయంతోటే ప్రజలకు చేరువ అవ్వాలని బోట్ ప్రయాణాన్ని ప్రియాంక నిర్ణయిచారు.
సోమవారం ఉదయం ప్రయాగరాజ్ చేరుకున్న ప్రియాంక అక్కడి హనుమాన్ మందిరం లో ఆ తర్వాత త్రివేణి సంగమానికి వెళ్లి అక్కడ గంగా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రయాగ్ రాజ్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ నియోజకవర్గమైన వారణాసి వరకు 140 కిమీ స్టీమ్ బోట్ లో ప్రయాణం చేయడానికి ప్రియాంక బయలుదేరారు. మన్నియ ఘాట్ వద్దకు చేరుకోగానే భద్రతావలయాన్ని దాటుకొని ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రజలతో, ప్రత్యే కించి మహిళలను ప్రియాంక కలుసుకున్నారు.
ఇందిరా గాంధీముఖ కవళికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక గాంధీ ని అతి దగ్గరగా చూడడం, ఆమెతో కరచాలనం చేయడం తో వెనుకబడిలా కులాలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. "యెహ్ ప్రియాంక గాంధీ నహీ ఆర్ ఏక్ ఇందిరా హై , ప్రియాంక నహీ బదలావ్ కే ఆంధీ హై ( ఈమె ప్రియాంక కాదు. మరోఇందిరా గాంధీ. ఈమె ప్రియాంక కాదు మార్పు కోసం వచ్చిన తుఫాను) అని నినాదాలు చేశారు. బోట్ వద్దకు చేరుకునే ముందు ప్రియాంక గాంధీ పై కార్యకార్తలు, ప్రజలు పూల వర్షం కురిపించారు. ప్రయాగరాజ్ లో బోట్ ప్రయాణం ప్రారంభించడానికి ముందుగా గంగా నది తీరాన తనను చూడడానికి వచ్చిన ప్రజలతో , ప్రత్యేకించి మహిళలతో ఆమె ఆప్యాయంగా మాట్లాడారు.