ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీ ధ‌నిక వ‌ర్గాల‌కే కాప‌లాదారు : ప‌్రియాంక ఘాటు విమ‌ర్శ‌లు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 01:16 AM

కాపలాదారుడినని చెప్పుకునే మోడీ ధనిక వర్గాలకు మాత్రమే కాపలాదారుడని, ప్రజలకు, రైతులకు కాదని  ప్రియాంక గాంధీ విమ‌ర్శంచారు. సోమ‌వారం ఇందిరా గాంధీ ప్రచారం తరహాలో మహిళల చేతులు పట్టుకొని పేరు అడుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. బోట్ లో కూడా కొందరు మహిళలతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ  ఆయ‌న గత లోక్ సభ ఎన్నికల ముందు ప్రధాని మోడీ ప్రజల కిచ్చిన హామీలు అమలు కాలేదని, అధికారం లోకి వచ్చాక ప్రజల కిచ్చిన హామీలను అధికార పక్ష నేతలు మరిచిపోయారన్నారు. ప్రధాని మోడీ కి అనుకూలంగా ఉన్న తూర్పు ఉత్తర ప్రదేశ్ లో మోడీ ప్రజలకిచ్చిన హామీలు అమలు కాలేదని  . మోడీ అధికారం లో వచ్చిన తర్వాత గంగా నది ప్రక్షాళనం కోసం 20 వేల  కోట్లు వ్యయం చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ 2 శాతం కూడా గంగా నది ప్రక్షాళన పూర్తి కాలేదని ప్రభుత్వం అంగీకరించడాన్ని ప్రజల్లో ఎట్టి చూపడానికి బోట్ ప్రయాణాన్ని వినియోగించే ప్రయత్నాన్ని ప్రియాంక ప్రారంభించారు. బోట్ ప్రయాణం ద్వారా బుధవారం ప్రియాంక వారణాసి చేరుకుంటారు. అక్కడినుంచి ఢిల్లీ కి తిరిగి వస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa