నేటి నుండి మా సంఘలనిటిని కలుపుకొని మహేష్ ను గెలిపించి పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి గిఫ్ట్ ఇస్తాం అని నగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన వెంకటరావుఅన్నారు. సోమవారం విజయవాడ గణపతిరావు రోడ్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో మహేష్ ను కలిసి అబినందనలు తెలిపారు. ఈ సందర్బంగా వెంకట్రావు మాట్లాడుతూ సిపిఐ, సిపిఎం, బిఎస్పి జనసేనల పొత్తు లో కూడా ఒక నగరాల సామజిక వర్గానికి విజయవాడ పశ్చిమ సీటును కేటాయించినందుకు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈసారి నగరాలందరూ మన కులస్థుడు మహేష్ కి గాజు గ్లాసు గుర్తుపై మన వోటు వేసి మనమెంటో మన ఐక్యత ఏంటో చాటలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa