తెదేపా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిని షబానా ఖాతూన్ సోమవారం ఉదయం 28వ డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబజార్ వద్దకు రాగానే అక్కడ ఉన్న రైతులు, పార్టీ అభిమానులు కూరగాయలతో కూర్చిన దండను వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, కేశినేని శ్వేత తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa