ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదల చేశారు. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కలెక్టర్లను ఈ సందర్భంగా ద్వివేది ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 27 నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుండగా.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa