ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్‌కు ఏపి భాజ‌పా ఘ‌న నివాళి

national |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 01:35 AM

ప్రజా సమస్యలనే తన సమస్యలుగా భావించి ప్రజా శ్రేయస్సే దేశ శ్రేయస్సుగా తుదిశ్వాస వరకు అలుపెరుగని సేవతో భరతమాతకు తన జీవితం అంకితం చేసిన యోధుడు ఈరోజు శాశ్వతంగా నిష్క్రమించార‌ని భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా క‌న్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గోవా ముఖ్యమంత్రిగా భారత దేశ రక్షణ మంత్రిగా విది నిర్వహణలో  ఎన్నో విశిష్ట సేవలు అందించి దేశ ప్రజల గుండెల్లో పారిక‌ర్ చెరగని ముద్ర వేశారని తెలిపారు. వారి మహోన్నత సేవలను ఈ భారతదేశం సగర్వంగా, శాశ్వ‌తంగా గుర్తుపెట్టుకుంటుంద‌ని పేర్కొంటూ మనోహర్ పారికర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్, కో ఇంచార్జ్ సునీల్ దియోధర్, జాతీయ మహిళా మోర్చా ఇంచార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం, బిజెపి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి వెంకట చైతన్య, కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa