ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడుల అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను భారత సైన్యం విడుదల చేసింది. దాడిచేసిన ప్రాంతాల్లో విధ్వంసానికి ముందు.. ఆ తర్వాత ఉపగ్రహాలు తీసిన పోటోలతో పోల్చిచూపింది. మురీద్‌కే, బహావల్‌పూర్ వంటి ప్రముఖ లక్ష్యాలకు సంబంధించిన ఫోటోలు, అలాగే పాకిస్థాన్ వైమానిక దళ రాడార్‌లు, స్థావరాలపై భారత్ చేసిన దాడులకు సంబంధించిన చిత్రాలూ ఇందులో ఉన్నాయి. ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. మే 7న తెల్లవారుజామున భారత సైన్యం పాకిస్థాన్ భూభాగం, పీఓకేలోకి ప్రవేశించి... ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, శిబిరాలపై మిస్సైల్ దాడులు చేసింది.
ఈ దాడుల్లో లష్కరే తొయిబా , జైషే-మహమ్మద్ , హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. మొత్తం 9 చోట్ల 24 క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. వీరిలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాకుడు మౌలానా మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులు సహా ఐదుగురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు ఉన్నారు.
మురీదకే
పాకిస్థాన్ వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన మురీద్‌లకే లష్కరే తొయిబా ప్రధాన కార్యాలయం ఉంది. దాదాపు 200 ఎకరాల స్థలంలో వ్యాపించే ఈ కేంద్రంలో ఉగ్రవాద శిక్షణ శిబిరం, ఇతర మౌలిక వసతులు ఉన్నాయి. ఆపరేషన్ కు ముందు, తరువాత ఫోటోలు ఈ కేంద్రం పై దాడి వివరాలను స్పష్టంగా చూపిస్తాయి.
బహావల్‌పూర్
పంజాబ్‌లోని భవల్‌పూర్ జైషే మహమ్మద్ కు ముఖ్య కేంద్రంగా ఉంది. పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని బహావల్పూర్ నగర శివార్లలో నేషనల్ హైవే-5 (కరాచీ-టోర్కామ్ హైవే)పై, కరాచీ మోర్ వద్ద ఉంది. ఇది జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన శిక్షణా, యువతలో తీవ్రవాద భావజాలం నాటే కేంద్రంగా విస్తరించింది. ఇది సుమారు 15 ఎకరాల్లో ఉంటుంది. ఈ మార్కజ్ జైష్ ఆపరేషనల్ ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు.. ఫిబ్రవరి 14, 2019న జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడిని అమలు చేసిన ఉగ్రవాదులు ఈ శిబిరంలోనే శిక్షణ పొందినట్టు తెలిసింది.
పాకిస్తాన్ వాయుసేన రాడార్‌లు, వైమానిక స్థావరాలు
భారత్ వైమానిక స్థావరాలు, సైనిక పోస్ట్‌లు, పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్ల దాడులకు దిగడంతో ఇండియన్ ఆర్మీ తీవ్రంగా స్పందించింది.
పాక్ ఎయిర్‌ఫోర్ రాడార్
పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, ఆయుధ డిపోలు (రఫ్లీ, చక్లాల, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, సియాల్‌కోట్ మొదలైనవి)పై దాడులు చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మే 9–10 మధ్య చేసిన దాడిలో అణుస్థావరానికి సమీపంలోని పాక్ వైమానిక స్థావరం కూడా ధ్వంసమైందని సైన్యాధికారులు పేర్కొన్నారు.
పాక్ రాడార్ కేంద్రం
ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చెందిన కొన్ని అత్యాధునిక విమాన వ్యవస్థలను కూల్చేశామని భారత వైమానికదళ ఎయిర్ మార్షల్ ఏకే భారతీ వెల్లడించారు. భారత స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను గగనతల రక్షణ వ్యవస్థలు సమర్ధవంతంగా అడ్డుకున్నాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa