ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సజ్జల శ్రీధర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 01:27 PM

మద్యం కుంభకోణంలో నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6)ని కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రీధర్‌రెడ్డి నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 15కి వాయిదా వేసింది. మరోవైపు, మద్యం కుంభకోణం కేసులో జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) దిలీప్‌ ఏసీబీ కోర్టులో సోమవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో దిలీప్‌ ఏ-30గా ఉన్నారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం కేసును ఈ నెల 15కి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa