శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో వీరమరణం పొందిన ఎం. మురళి నాయక్‌కు ఘనంగా నివాళులర్పించారు. దేశభక్తితో పాటు జాతీయ గౌరవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది తదితరులు భారీగా పాల్గొన్నారు. ర్యాలీ సర్వత్రా దేశభక్తి మంటలతో మార్మోగింది. "మురళి నాయక్ అమర్ రహే", "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" వంటి నినాదాలతో ర్యాలీకి ఉత్సాహం చేకూరింది.
ఈ కార్యక్రమం ద్వారా మురళి నాయక్ త్యాగాన్ని గుర్తు చేస్తూ యువతలో దేశభక్తిని రగిలించేందుకు యూనివర్సిటీ చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa