గుజరాత్ అహ్మదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రాధే రెసిడెన్సీలో రాట్‌వీలర్ బ్రీడ్‌కు చెందిన పెంపుడు కుక్క 4 నెలల చిన్నారి రిషికపై విరుచుకుపడి చంపేసింది. చిన్నారి తల్లిదండ్రులు అప్రమత్తం కావడానికి ముందే కుక్క తీవ్రంగా దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన సొసైటీ సీసీ కెమెరాల్లో నమోదైంది. పెంపుడు కుక్కల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa