జీలుగుమిల్లి: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో మరికాసేపట్లో జరిగే జగన్ సభకు పార్టీ నాయకులు తరలివెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ సభకు తరలివెళ్లారు. కొల్లూరు రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బైక్ లపై ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. జగన్ సభలో పాల్గొనేందుకు జిల్లా నలు మూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం , పోలవరం నియోజకవర్గం వెస్ట్‌లో ఈరోజు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం కృష్ణా జిల్లా అవనిగడ్డకు వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa