ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ 2వ విడత ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

national |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 12:35 PM

న్యూఢిల్లి :  లోక్‌సభకు రెండవ విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ నేడు విడుదల చేసింది. ఏప్రిల్‌ 18న పోలింగ్‌ జరిగే రెండవ విడతలో 97 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ విడతలో నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 26వ తేదీ గడువుగా నిర్ణయించారు. మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 29 వరకూ ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. తమిళనాడులోని 39 నియోజక వర్గాలకు రెండవ విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక 14, మహారాష్ట్ర 10, ఉత్తర్‌ ప్రదేశ్‌ 8, అస్సాం, బీహార్‌, ఒడిశా 5 చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌ 3 చొప్పున, జమ్ము కాశ్మీర్‌ 2, మణిపూర్‌, త్రిపుర, పుదుచ్చేరిలలో 1 చొప్పున నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa